స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభంతోనే నష్టాలతో మొదలైన మార్కెట్లు ఊగిసలాట ధోరణిలోనే కొనసాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 82 పాయింట్లు నష్టపోయి 40,281 దగ్గర ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 11 వేల 797 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71 .84 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కరోనా భయాల కారణంగా ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. దీంతో ఆయిల్, ఫార్మా, ఆటోమొబైల్‌ రంగ షేర్లు బలహీనపడ్డాయి. టీసీఎస్‌, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హిందాల్కో, గెయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.