నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

కరోనా కరోనా ప్రభావం స్టాక్ మార్కెట్లను వీడడం లేదు. కరోనా వైరస్ అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలతో ముగించాయి. గురువారం మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి సమాయానికి… సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 39,745కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 11,633 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 71.62గా కొనసాగుతోంది. సన్‌ ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, గ్రాసిమ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎన్జీసీ, ఐఓసీఎల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.