నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…!

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే మార్కెట్లలో అనిశ్చితి కనిపించింది. ముగింపు వరకు అదే ట్రెండ్ కొనసాగడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 202 పాయింట్ల నష్టంతో 41,055 వద్ద… నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 12,045 వద్ద ముగిసింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిద్‌-19(కరోనా వైరస్‌).. మార్కెట్లపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికితోడు ఐరన్‌, ఆయిల్‌ షేర్లు నష్టాలు చవిచూడడంతో… మార్కెట్లు కుదుపుకు లోనయ్యాయి. అటు… నెస్లే, టైటాన్, కోటక్ మహీంద్రా, వేదాంత షేర్లు లాభాల్లో ముగియగా… ఓఎన్జీసీ, సిప్లా, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్ సంస్థల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక.. అమెరికా డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ 71.39 వద్ద కొనసాగుతోంది.