`కంగ్రాట్స్ రామూ తాతయ్య గారు`.. వర్మపై రాజమౌళి ట్వీట్!

టాలీవుడ్‌లో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ, ఎవరో ఒకరిపై సటైర్లు వేస్తూ వర్మ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ, వర్మనే టీజ్‌ చేస్తే…? అవును.. ఇప్పుడు అదే పని దర్శకుడు రాజమౌళి చేశాడు. రామ్‌గోపాల్ వర్మను టీజ్ చేస్తూ.. రాజమౌళి ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. విషయం ఏంటంటే… వ‌ర్మ కూతురు రేవతి సోమవారం ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్వీట్ చేస్తూ.. తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ‘కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ… మీ మనవరాలు మిమ్మల్ని ఏలేంత గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? రాము తాతా, రాము నాన్న లేకపోతే గ్రాండ్‌పా రామూనా?’ అని ట్వీట్‌లో కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌కు వర్మను ట్యాగ్ చేశాడు. ఇక దీనిపై వ‌ర్మ ఎలా స్పందిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.