మక్కా సందర్శనపై తాత్కాలిక నిషేధం… కరోనా ఎఫెక్ట్!

సౌదీ విదేశాంగ శాఖ సంచనల నిర్ణయం తీసుకుంది. మక్కామసీదును సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. కరోన ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి పవిత్ర మక్కాలోకి అనుమతులను నిలిపివేస్తున్నట్లు సౌదీఅరేబియా స్పష్టం చేసింది.

కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ఇప్పటికే చైనాతో పాటు వివిధ దేశాలను వణికిస్తున్నది. ఈ కేసుల సంఖ్య చైనాలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, యూరప్‌, ఆసియా, తూర్పు మధ్య దేశాల్లో మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే ఇరాన్‌లో 15మంది మరణించగా.. గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల్లో కూడా ప్రభావం అధికంగా ఉంది. దీంతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం, మక్కాకు వచ్చే యాత్రికులకు కొత్తగా వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది.

ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాకు కేవలం హజ్‌ సమయంలోనే కాకుండా యేడాది పొడువునా లక్షల సంఖ్యలో యాత్రికుల తాకిడి ఉంటుంది. దీనికోసం సౌదీఅరేబియా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రత్యేక వీసాలను జారీచేస్తుంటుంది. అయితే కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వీసాల జారీ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించేవారిని కూడా అనుమతించబోమని పేర్కొంది. ఈ తాత్కాలిక నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అంతేకాకుండా ఏయే దేశాల నుంచి వచ్చే వారిని అనుమతించరనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

సౌదీ గవర్నమెంటు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉమ్రా ప్యాసింజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం తీసుకున్న అకాస్మాత్ నిర్ణయంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు మక్కా వెళ్లే ప్రయాణికులు నిలిచిపోయారు. కరోనా వైరస్ మూలంగా ఇండియా నుంచి కూడా రానీయొద్దని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ విషయం వీసాలు పొందిన వాళ్లకు గానీ, ట్రావెల్ ఏజెంట్లకు గానీ తెలియజేయలేదని.. సడెన్గా ట్రిప్ క్యాన్సిల్ చేసుకోమంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఇలా వెనక్కి పంపిస్తే ఎలా అని ఇండియాకు వచ్చిన ఓ ఎన్నారై ప్రశ్నిస్తున్నాడు. ఇక… సౌదీ సర్కారు తీసుకున్న హఠాత్ నిర్ణయంతో ఉమ్రా ప్రయాణికులు ఊసూరుమన్నారు. ఎప్పుటికి యాక్సెప్ట్ చేస్తారో కూడా తెలియదని, హాలిడేస్ ప్లాన్ చేసుకుంటే మొత్తం టూఐరే డిస్ట్రబ్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.