భారత్‌లో శాంసంగ్‌ ఎం31 విడుదల…

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ‘ఎం’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గత ఏడాది ఎం30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన శాంసంగ్‌.. మంగళవారం రోజు గెలాక్సీ `ఎం 31`ను భారత్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 14999గా నిర్ణయించింది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ హై ఎండ్‌ మోడల్‌ ధర రూ. 15,999గా ఉంచింది. ఈ ఫోన్‌ను మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం31 ఫీచర్లు…

  • 6.4 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఇన్ఫినిటీ-యు సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
  • 2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
  • ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్‌ 10, డ్యుయల్‌ సిమ్‌
  • 64, 8, 5, 5 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు
  • 32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
  • డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0
  • యూఎస్‌బీ టైప్‌ సి, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌