ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరిస్తున్న సమిత్ ద్రవిడ్…

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ చెలరేగిపోతున్నాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. రెండు నెలల లోపే రెండు డబుల్ సెంచరీలు బాదిన సమిత్.. తాజాగా మరో ద్విశతకాన్ని కొద్దిలో మిస్‌ చేసుకున్నాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ 1, డివిజన్ 2 టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో సమిత్ బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు. 131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేసి అవుటయ్యాడు. మరోవైపు, బంతితోనూ సత్తా చాటాడు. నాలుగు వికెట్లు పడగొట్టి తమ జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ సెమీఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.