ఫస్ట్ లవ్‌పై వీడియో రిలీజ్ చేసిన సచిన్..!

వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి ఓ విష‌యాన్ని చెప్పాడు. మాస్టర్ బ్లాస్టర్ త‌న ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు. త‌న ఫ‌స్ట్ ల‌వ్ క్రికెట్ అన్న విష‌యాన్ని ఆ వీడియోతో చెప్పేశాడు. త‌న ఫ‌స్ట్ ల‌వ్ త‌నకు ఇష్టమైన క్రికెట్ అన్న సంకేతాన్ని ఇచ్చాడు. 43 ఏళ్ల స‌చిన్ టెండూల్కర్‌.. 2013లోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ఇటీవ‌ల ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన.. అక్కడ మళ్లీ బ్యాట్ ప‌ట్టాడు. ఆ టైమ్‌లో తీసిన వీడియోను సచిన్ షేర్ చేశాడు.