శబరిమల కేసు విచారణ వాయిదా….

కేరళలోని శబరిమల సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టం చేశారు. విచారణ చేపట్టాల్సిన అంశాల క్రోడీకరణ కోసం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం చెబుతామని ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.