ఐపీఎల్‌ 2020: ఆర్సీబీ షెడ్యూల్‌ విడుదల…

ఈ ఏడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి ప్రారంభమవుతుండగా ఆరంభ మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య వాంఖడేలో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మే 24న ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తన షెడ్యూల్‌ను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఏయే తేదీల్లో ఏయే జట్లతో తలపడనుందో వెల్లడించింది. ఆర్సీబీ తొలి మ్యాచ్‌ మార్చి 31న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరగనుండగా రెండో మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న ముంబై ఇండియన్స్‌ తో జరగనుంది. గత 12 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేని ఈ జట్టు ఈసారైనా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే కెప్టెన్‌ కోహ్లీసైతం ఎంతో పట్టుదలగా ఉన్నాడు. దీంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 13వ సీజన్‌లో ఈ జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.