రాస్‌ టేలర్‌ సరికొత్త రికార్డు…

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌ మన్‌ రాస్‌ టేలర్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతకు శ్రీకారం చుట్టాడు. న్యూజిలాండ్‌-భారత్‌ మధ్య ఇవాళ(శుక్రవారం) జరుగుతున్న టెస్టు… టేలర్‌ కెరీర్‌లో వందో టెస్టు. వన్డే ఫార్మాట్‌లో 231 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. ఇటీవల భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో 100 వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో వంద మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డుకు నాంది పలికాడు. టీ20 క్రికెట్‌ ప్రారంభమై 15 ఏళ్లే అయినా… సీనియర్‌ ఆటగాళ్లంతా రిటైర్మెంట్‌ తీసుకున్నారు. దీంతో టేలర్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.