భారత్‌లో రెడ్‌మీ 8ఏ లాంఛ్… బడ్జెట్‌ ధరలో!

చైనా మొబైల్స్‌ తయారీదారు షావోమి మరోసారి బడ్జెట్ ధరలో నూతన స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చంది. రెడ్‌మి ఏ సిరీస్‌కు కొనసాగింపుగా… రెడ్‌మి 8ఎ డ్యుయల్‌ను భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. కాగా.. ఈ మొబైల్‌ మోడల్‌లో మొదటిసారి రెడ్‌మీ ఎ సిరీస్‌కు డ్యూయల్ కెమెరాలను జోడించింది. కొత్త “ఆరా ఎక్స్‌గ్రిప్” డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరాలతో, రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.

`రెడ్‌మి 8ఎ డ్యుయల్‌` మొబైల్ లో ఫీచర్లు:

6.22 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 1520×720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, ఫేస్‌ అన్‌లాక్‌, డెడికేటెడ్‌ డ్యుయల్‌ సిమ్‌ స్లాట్స్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌, యూఎస్‌బీ టైప్‌ సి.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6499 ఉండగా, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.6,999గా ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌ వెబ్‌సైట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయని షావోమి ప్రకటించింది. వినియోగదారులు, అభిమానులు తమ ఉత్పత్తులను తప్పక ఇష్టపడతారని విశ్వసిస్తు న్నామని షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుజ్ శర్మ అన్నారు.

రెడ్‌మి పవర్ బ్యాంక్:

దీంతోపాటు రెడ్‌మి 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, 20,000 ఎంఏహెచ్‌ లను కూడా తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ .799, రూ .1,499 ధరలతో వినియోగదారులకు అందిస్తోంది. వైర్‌లెస్‌ ఎంఫ్‌ రేడియో, పవర్‌ ఫుల్‌ స్పీకర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా రెడ్‌మి వెల్లడించింది.