రవితేజ ‘క్రాక్‌’ మూవీ టీజర్‌…

మాస్‌ మహారాజ రవితేజ కథనాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్‌’. ఈ చిత్రంలో శృతి హాసన్‌ కథానాయిక నటిస్తోంది. ఇప్పటికే ఈ ద్వయం కాంభినేషన్‌లో వచ్చిన ‘డాన్‌శీను’, ‘బలుపు’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మహా శివరాత్రి సందర్భంగా క్రాక్‌ టీజర్‌ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని, దేవీ ప్రసాద్‌, పూజిత పొన్నాడ, హ్యాపీడేస్‌ సుధాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. శర వేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. రవితేజ ఫ్యాన్స్‌ మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని… టీజర్‌కు అన్ని వర్గాల నుంచి పాజిటీవ్‌ రెస్పాన్స్‌ వస్తోందని గోపిచంద్‌ పేర్కొన్నారు.