ఇండియన్‌-2 ప్రమాదం: `మానాడు` చిత్ర బృందానికి బీమా…

కమల హాసన్ నటిస్తోన్న ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో ఇటీవల భారీ ప్రమాదంతో సినీ ఇండస్ట్రీ మేల్కోంది. ఇండియాన్‌-2 ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో.. పలు నిర్మాణ సంస్థలు లొకేషన్లలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు టెక్నీషియన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో అలర్ట్ అయిన ‘మానాడు’ చిత్ర నిర్మాతలు… బృందం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న బృందానికి బీమా చేయించారు. ఈ సినిమాలో కథానాయకుడిగా శంబు నటిస్తుండగా… వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా బృందం కోసం 7.8 లక్షల రూపాయలు ఖర్చు చేసి… రూ.30 కోట్ల విలువైన బీమా చేయించారు. సినిమా కోసం పనిచేస్తోన్న కార్మికుల సంక్షేమం కోసం ఈ బీమా చేయించినట్టు… నిర్మాత సురేష్ కామాక్షి తెలిపారు. దీంతో ఆ సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సినిమా యూనిట్ ఇలాగే బీమా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.