క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ప్రజ్ఞాన్‌ ఓజా…

టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు తన ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా ఓజా ప్రకటించాడు. తన కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇదే తగిన సమయని పేర్కొన్న ఓజా.. తన కెరీర్‌ ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఓజా… భారత్‌ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 113 వికెట్లు సాధించి.. వన్డేల్లో 21 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 10 వికెట్లను తీశాడు. ఐపీఎల్‌లో దక్కన్‌ చార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున ఓజా ఆడాడు. 2014లో బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు తలెత్తగా, 2015లో క్లియరెన్స్‌ లభించింది.