సుప్రీంను ఆశ్రయించిన ఒమ‌ర్ అబ్దుల్లా సోద‌రి…

జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లాను.. ప్రజా భ‌ద్రతా చ‌ట్టం కింద నిర్బంధంలోకి తీసుకోవడంపై.. ఆయన సోద‌రి సారా పైల‌ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఒమ‌ర్‌ను ఎలా నిర్బంధిస్తార‌ని ఆమె పిటిష‌న్ వేశారు. జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాసనం ఈ కేసును విచారించ‌నుంది. హెబియ‌స్ కార్పస్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు ఈ కేసును వాదిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబ‌ల్ చెప్పారు. ఈ వారంలోనే ఈ కేసును విచారించాల‌ని ఆయన కోర్టును కోరారు. బెంచ్ కూడా దీనికి అంగీక‌రించింది.