సుప్రీం కోర్టులో నిర్భయ కేసు విచారణ వాయిదా…

నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదావేసింది. దోషులకు విడిగా ఉరిశిక్ష అమలు చేయడాన్ని తిరస్కరిస్తూ ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారించనున్నట్లు తెలిపింది. కేంద్రం పిటిషన్ పై నిర్భయ దోషులు వివరణ ఇవ్వాలని సుప్రీంకోరింది.