16 నుంచి కాశీ-మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ పరుగులు…

న్యూఢిల్లీ- లక్నో, ముంబై- అహ్మదాబాద్‌ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్న నేపధ్యంలో.. ఫిబ్రవరి 16న మరో ప్రైవేటు ట్రైన్‌ ప్రారంభం కానుంది. కాశీ మహాకాళ్ ఎక్స్‌ ప్రెస్ పేరుతో ఈ రైలు వారణాసి-ఇండోర్‌ మధ్య నడవనుంది. ఐఆర్‌సీటీసీ సారధ్యంలో నడిచే ఈ కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా ఫిబ్రవరి 16 నుంచి వారణాసి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20 నుంచి సాధారణ ప్రయాణికులు ఈ రైలులో రాకపోకలు సాగించేందుకు అనుమతించనున్నారు. అయితే ఈ రైలు రాకపోకలు సాగించే సమయాలు ఇంకా వెల్లడించాల్సి వుంది.