గోవాలో కూలిన మిగ్‌-29కే యుద్ధ విమానం…

భారత నావికా దళానికి చెందిన మిగ్–29కె శిక్షణ విమానం ఆదివారం ఉదయం గోవా తీరంలోని అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్నీ భారత నావికాదళం ధృవీకరించింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడని నావికా దళం ప్రకటించింది. ఈ విమానాన్ని పైలట్ల శిక్షణ కోసం వాడుతున్నారు. ఎప్పట్లానే ఆదివారం ఉదయం కూడా శిక్షణ కోసం బయల్దేరిన విమానం 10.30 గంటల సమయంలో సముద్రంలో కూలిపోయిందని నేవీ అధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణం పైలట్ తప్పిదమా? లేక విమానం నిర్వహణ లోపమా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు… విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.