ప్రారంభమైన నాగశౌర్య కొత్త సినిమా…

యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా షూట్‌ను ప్రారంభించాడు. ఈ యంగ్ హీరో కథానాయకుడిగా నటించిన అశ్వథ్థామ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో వెంటనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య అనే లేడీ డైరెక్టర్ టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సినిమాలో నాగశౌర్య సరసన పెళ్లిచూపులు ఫేమ్ రీతువర్మ నటిస్తుండగా… ఈనెల 19 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. కాగా.. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.