గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటీనటులు…

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురంలో సినీ నటీనటులు తులసి, వై.విజయ, జూనియర్ రేలంగి, శశాంక, కిషోర్ దాస్, దర్శకుడు రామకృష్ణ, కెమెరామన్ జగదీశ్ తదితరులు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని నటి తులసి చెప్పారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాల్లో మొక్కలు బహుమతిగా ఇవ్వాలని సూచించారు. అటు.. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని కోరారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.