మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి బాధ్యతలు…

మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తార్నాక హెచ్ఎండీఏలో జరిగిన ఈ కార్యక్రమానికి… హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ సదర్భంగా మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాని తెలిపారు. మూసీ నది అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టే… అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో మూసీ సుందరీకరణ చేపడతామన్న సుధీర్ రెడ్డి… నది సుందరీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని పేర్కొన్నారు.