డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన…

నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తెలిపారు. అందుకు అనుగుణంగా పేదల కోసం విడతలవారిగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు. జగిత్యాల జిల్లా నూకపల్లి శివారులో 360 డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ గుగులోత్ రవితో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాను అగ్రస్దానంలో నిలబెడతామని జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.