మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ…

ఖమ్మం నగరంలో అమృత్ నిధులతో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్‌ను… మార్చి 1న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌ పనులను మంత్రి అజయ్ కుమార్, కలెక్టర్ కర్ణన్‌, మేయర్ పాపాలాల్‌, మున్సిపల్ కమిషనర్‌ అనురాగ్‌ పరిశీలించారు. అయితే.. ఖమ్మం నగర వాసులు అవసరాలను గుర్తించి.. లకారం ట్యాంక్ బండ్ ప్రక్కనే మరొకటి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతనంగా నిర్మించే మినీ ట్యాంక్‌ బండ్‌లో వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే పరికరాలు, సేద తీరేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. దీని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి… చెరువు నీటిని పరిరక్షిస్తామని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.