కొత్త జిల్లాల్లోనూ కేవీకేలు. ఏర్పాటు చేయాలి :మంత్రి నిరంజన్ రెడ్డి

న్యూఢిల్లీలో జరిగిన 91వ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొరు. ఈ సందర్భంగా మంత్రి వివరాలను వెల్లడిస్తూ… కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతివ్వాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కొత్త కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్లు చెప్పారు. కొత్త జిల్లాల్లోనూ కేవీకేలను ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఎన్జీవోలు నిర్వహిస్తున్న కేవీకేలపై సమీక్ష అవసరమని… ఆ కేవీకేల బాధ్యతలను యూనివర్సిటీలకు అప్పగించాలని తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి కృషి విజ్ఞాన కేంద్రం బాధ్యతను ఇవ్వాలని కోరారు. దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ అవసరమని… దానిపై కేంద్రం దృష్టి సారించాలని కోరానన్నారు. కేంద్రం కందులకు మద్దతు ధర రూ.5,800 నిర్ణయించింది. మద్దతు ధరతో కొనుగోలుకు కేంద్రం 47,500 మెట్రిక్‌ టన్నులకు అనుమతి ఇచ్చిందని… మరో 50 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని కోరినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.