ఎవరికీ కొవిద్‌-19 నిర్థారణ కాలేదు :మంత్రి ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొవిద్‌-19(కరోనా వైరస్‌) కేసు నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో ఒక్కరికి కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని మంత్రి ఈటెల తెలియజేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దనీ.. కొవిద్‌-19పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని మంత్రి వెల్లడించారు.