తాజ్‌ దృశ్యాలను షేర్ చేసిన మెలానియా ట్రంప్…

తాజ్ మహల్ మాటలకందని అద్భుతం అని అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ అన్నారు. ఇండియా పర్యటను వచ్చిన ట్రంప్ దంపతులు గంటకుపైగా ప్రేమసౌథంలో విహరించారు. ఆ వీడియోను మెలానియా ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దగ్గరగా చూడటం మరిచిపోలేని అనుభూతి అని క్యాప్షన్ ఇచ్చారు. 47 సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఆ వీడియోలో.. మెలానియా, ట్రంప్‌ చేతిలో చేయివేసి తాజ్‌ ప్రాంతంలో కలియ తిరిగిన దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో, కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.