మార్కండేయ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌కు అనుమతి…

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో నిర్మించనున్న మార్కండేయ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీపీఆర్‌ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో దాదాపు 6 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి అర(0.5) టీఎంసీ నీళ్లతో మార్కండేయ ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదన చేశారు. దీని నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సర్వే, డీపీఆర్ తయారీ కోసం అనుమతులిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.