ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ రాజీనామా…?

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ రాజీనామా చేశారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి సమర్పించినా… అధిష్ఠానం తిరస్కరించినట్లు సమాచారం. తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మనోజ్ కీలకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఫలితాలు ఆప్ వైపుకే మొగ్గు చూపుతున్నా సరే… బీజేపీయే విజయం సాధిస్తుందని చెబుతూ, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలను తాము విశ్లేషించుకుంటామని, తిరిగి ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని మనోజ్ తివారీ తెలిపారు.