దోషులు చట్టంతో ఆటలాడుతున్నారు :సీమా కుష్వాహా

నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలవుతుందని నిర్భయ తరపున వాదిస్తున్న లాయర్ సీమ కుష్వాహా అన్నారు. దోషులు చట్టంతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. వరుస పిటిషన్లతో విలువైన కోర్టు సమయాన్ని దోషులు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అయితే, త్వరలోనే కోర్టు విచారణను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు.. డెత్ వారెంట్ల జారీపై కూడా తీర్పు సానుకూలంగానే వచ్చే అవకాశాలు ఉన్నట్టు సీమ కుష్వాహా తెలిపారు.