ఢిల్లీ అల్లర్లలో కేజ్రీవాల్ ప్రమేయం :కపిల్ మిశ్రా

ఢిల్లీ అల్లర్లలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ప్రమేయం ఉందంటూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫోన్ కాల్ డిటైల్స్ చూస్తే ఇదే విషయం అర్థమవుతుందని ఆయన ట్వీట్ చేశారు. కాల్ డేటా పరిశీలిస్తే ఢిల్లీ అల్లర్లు, ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక సీఎం కేజ్రీవాల్, సంజయ్ సింగ్ పాత్ర ఉన్న విషయం బయట పడుతుందన్నారు. అటె తాహిర్ హుస్సేన్‌ను కాపాడేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కపిల్ మిశ్రా ఆరోపించారు.