బుమ్రా నెంబర్ వన్ ర్యాంక్ పోయింది!

న్యూజిలాండ్‌ తో వన్డే సిరీస్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం 719 పాయింట్లతో అతడు రెండో స్థానానికి పడ్డాడు. బుమ్రా వైఫల్యం న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ కు కలిసొచ్చింది. గాయం కారణంగా సిరీస్‌ ఆడకపోయినా అతడికి నంబర్‌వన్‌ ర్యాంకు సొంతమైంది. కివీస్‌తో సిరీస్‌లో 2 వికెట్లతో పాటు 63 పరుగులు చేసిన జడేజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరాడు. అఫ్గానిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబి నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. వన్డే బ్యాట్స్‌ మన్‌ ర్యాంకింగ్స్‌ లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరుసగా 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నారు.