గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ చీఫ్…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు భాగస్వామలయ్యారు. తాజాగా, ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించిన ఆయన… ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్‌లో మొక్కలు నాటారు. అనంతరం, ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవి కిరణ్ కూచిబొట్లకు గ్రీన్ ఛాలెంజ్‌ విసిరారు. కాగా, ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు విసిరిన ఛాలెంజ్‌ను తక్షణమే స్వీకరించిన రవి కిరణ్ కూచిబొట్ల… ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని కోరిన ఇరువురు… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.