రెండో టెస్టు కోసం భారత్-కివీస్ ముమ్మర కసరత్తు…

ఈనెల 29 నుంచి క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం అటు భారత్, ఇటు కివీస్ ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. రెండో టెస్టు కూడా గెలిచి క్లీస్ స్వీప్ కోసం న్యూజిలాండ్‌, తొలి టెస్టు ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్టులోనైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్‌, పది వికెట్ల తేడాతో తొలి టెస్టును గెలుపొందిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి టెస్టు సిరీస్‌ కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి చవిచూసిన టీమ్‌ఇండియా… ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడనున్నాయి.