ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్…

భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ సర్వేలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను వెనక్కి నెట్టేసింది. ఇండియా జీడీపీ 10.51ట్రిలియన్ల డాలర్లుగా ఉన్నట్టుగా తెలిపిన సర్వే.. ఓపెన్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా పరిణితి చెందుతున్నదని తన నివేదికలో వెల్లడించింది. జీడీపీలో జపాన్, జర్మనీ దేశాలను దాటేసినట్లు వెల్లడించిన సంస్థ.. వృద్ధి రేటు మాత్రం వరుసగా మూడో ఏడాది పడిపోయినట్లు చెప్పింది.