డిఫెన్స్ ఇన్స్టిట్యూట్‌కు పారిక‌ర్ పేరు…

ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాల‌సిస్ సంస్థ పేరును మార్చారు. ఆ ఇనిస్టిట్యూట్‌కు దివంగత మాజీ కేంద్ర మంత్రి మ‌నోహర్ పారిక‌ర్ పేరును పెట్టారు. ఇక నుంచి ఆ సంస్థను పారిక‌ర్ ఇనిస్టిట్యూట్‌గా పిలువ‌నున్నారు. ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాల‌సిస్ సంస్థ కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో న‌డుస్తుంది. ఇకనుంచి ఆ సంస్థను మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాల‌సిస్ అని పిలుస్తారు. పారిక‌ర్ సేవ‌ల‌ను గుర్తించి, ఆయ‌న‌కు త‌గిన గౌర‌వాన్ని ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.