ICC టీ20 ర్యాంకింగ్స్: కోహ్లీ పదో స్థానం..రాహుల్ రెండో స్థానం

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ లో భారత సారథి విరాట్‌ కోహ్లీ ఒక స్థానం తగ్గి పదో స్థానానికి పరిమితమయ్యాడు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్ రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. రోహిత్‌ శర్మ 11వ స్థానంలో నిలిచాడు. పాక్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ లో, మహ్మద్‌ నబీ ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్‌లో ఉన్నారు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌ లో పాకిస్థాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.