సీఎం కేసీఆర్ నెలకు రూ. 70 కోట్లు ఇస్తున్నారు…

కార్పొరేటర్లు నేరుగా ప్రజల్లోకి వెళ్లి సేవచేసే మంచి అవకాశన్ని సీఎం కేసీఆర్ కల్పించారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి డివిజన్‌ పచ్చదనంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. పల్లె ప్రగతి స్పూర్తితో పట్టణ ప్రగతి విజయవంతం చేయాలని కోరారు. సీంఎ కేసీఆర్ నెలకు రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని… ప్రజలకు సరిపోయే విధంగా డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలను నిర్మించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు పది రోజులు మీ వెంటే ఉంటారు కనుక… సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని తెలిపారు వరంగల్ అర్భన్ జిల్లా హన్మకొండలో… పట్టణ ప్రగతిపై వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని… ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు సద్వినియోగం అయ్యేలా ప్రనాళికలు రూపొందించాలని సూచించారు. ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు.