గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన జీవీఎంసీ కమిషనర్‌…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖపట్నం కమిషనర్‌ సృజన భాగస్వాములయ్యారు. వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కమిషనర్‌… జారీపేటలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కూమార్‌కు అభినందనలు తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని 147 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొక్కలు నాటాలని… అధికారులకు కమిషనర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.