చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత…

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. ఫారిన్‌ నుంచి చెన్నైకి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులకు.. అతడి లగేజీలో 2 కిలోల బంగారం లభించింది. ఈ బంగారానికి సంబంధించి ప్రయాణికుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, సీజ్ చేశారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని.. బంగారం ఎక్కడికి తరలిస్తున్నాడు..! అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. కస్టమ్స్‌ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.