బాలాకోట్ దాడితో ఉగ్రవాదుల్లో భయం పుట్టింది…

పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దాడులతో ఉగ్రవాదులు భయపడ్డారని ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ బీఎస్‌ ధనోవా తెలిపారు. అందుకే.. ఆ తర్వాత భారత్‌లో పెద్ద ఉగ్రఘటనలు జరగలేదని అన్నారు. బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపి ఏడాదైన సందర్భంగా… ఆయన వ్యాఖ్యలు చేశారు. నాటి దాడిని తలచుకుంటే చాలా సంతృప్తిగా ఉందన్న ధనోవా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్స్ లో బాలాకోట్ కీలకమైనదన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా.. ఎయిర్ ఫోర్స్ చొచ్చుకెళ్లి మట్టుబెడుతుందని ఆయన హెచ్చరించారు.