`టామ్‌ అండ్ జెర్రీ`కి 80 ఏళ్లు…

`టామ్ అండ్ జెర్రీ` ఈ ప్రోగ్రాం పేరు తెలియని పిల్లలు ఉండరు. నైంటీస్‌లో పిల్లలకు అంతగా తెలియకపోయినా… ట్వంటీస్‌లో మాత్రం ప్రతీ బుడతడికి తెలిసే ఉంటుంది. చిన్నతనంలో టామ్ అండ్ జెర్రీ చేసే చమత్కారాలకు చిన్నారులు మంత్రముగ్దులైపోతారు. ఇందులో ఎలుక, పిల్లి కలిసి పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ఈ ప్రోగ్రాం చూస్తున్నంత సేపు తమను తాము మర్చిపోతూ… ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ప్రోగ్రాం ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిందనే చెప్పాలి.

ఈ ప్రోగ్రాంకు చిన్నారులే కాదు.. కొందరు పెద్దవాళ్లు కూడా ఫ్యాన్స్‌ ఉన్నారంటే, ఎంతలా ఆకర్షిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1940, ఫిబ్రవరి 10న ‘ది మిడ్‌నైట్‌ స్నాక్‌’ పేరుతో బుల్లితెరపై ప్రత్యేక్షమై… ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ‘టామ్‌ అండ్ జెర్రీ’ ఇవాళ్టికి 80 వసంతాలు పూర్తి చేసుకుంది. ‘పస్ గెట్స్ ది బూట్’ ఎపిసోడ్ పేరుతో మొట్టమొదటి షార్ట్‌ ఫిలిమ్ విడుదలైంది. దీనిలోని పిల్లి పేరు జాస్పర్‌గా, ఎలుక పేరు జింక్స్‌గా అప్పట్లో రూపొందించారు. ఆ తర్వాతి ఏడాది నుంచి దీని పేరు ‘టామ్‌ అండ్ జెర్రీ’గా మారింది.

చిన్నారులతో పాటు పెద్దలూ ఇష్టంగా చూసే ‘టామ్‌ అండ్ జెర్రీ’ సృష్టికర్తలు విలియం హన్నా, జోసెఫ్‌ బార్బారా. 1940లో ‘ది మిడ్‌నైట్‌ స్నాక్‌’ (టామ్‌ అండ్‌ జెర్రీ)గా మొదలు పెట్టి 1958 వరకు మొత్తం 114 సినిమాలను రూపొందించారు. వీరికి ఏడు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి. టామ్‌ అండ్‌ జెర్రీ 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పిల్లి, ఎలుకలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. 1940లో విడుదలైన తొలి ఎపిసోడ్‌ను మనం కూడా ఒకసారి చూద్దాం పదండి…