క్వాటర్ ఇస్తేనే దిగుతా… కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు!

హైదరాబాద్‌లో ఓ తాగుబోతు హల్‌చల్‌ చేశాడు. సికింద్రాబాద్‌ డీ మార్ట్‌ సమీపంలోని స్ట్రీట్ లైట్ పోల్‌ ఎక్కి హంగామా చేశాడు. దీంతో అక్కడ రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది. ఇంతకు ఆ మందుబాబు పోల్ ఎక్కింది ఎందుకు అనుకుంటున్నారు..? వాటర్, క్వాటర్ బాటిల్ కోసం. అవును.. మీరు చదివింది నిజమే. క్వాటర్ ఇస్తే కాని దిగనంటూ నానా హంగామా చేశాడు. ఇవ్వకపోతే కిందికి దూకుతానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాదు.. మందు కావలంటూ కింద ఉన్నవారికి సైగలు చేస్తూ పోల్ పైన వివిధ యాంగిల్స్ డ్యాన్స్‌లు చేస్తూ హల్‌చల్ చేశాడు. ఇక తప్పదు అనుకున్నారేమో కానీ… ఈ మహోత్తమ తాగుబోతు డిమాండ్ మేరకు క్వాటర్, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన పోలీసు, మందుబాబును చాకచక్యంగా కిందికి దించారు.

వివరాల్లోకి వేళ్తే… వరంగల్ జిల్లాకు చెందిన ఇజాజ్ గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో.. ఆదివారం రోజు పోల్ ఎక్కి నానా హంగామా చేశాడు. సికింద్రాబాద్‌ సంగీత్ సర్కిల్ సమీపంలోని డీ మార్టు పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్‌ పోల్ ఎక్కి కూర్చున్నాడు. మద్యం బాటిల్ తెచ్చివ్వాలని.. లేదంటే దూకేస్తానంటూ బెదిరించాడు. ఇక.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న గోపాలపురం పోలీసులు… నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. ఎక్కడ కిందకు దుకుతాడోనాని.. క్రింద భారీ పరదలు పరిచి, కాపాడేందుకు ఏర్పాటు చేశారు.

కింద జనాలను చూసిన మందుబాబు.. మద్యం కావాలని సైగలు చేస్తూ, పోల్ పైన వివిధ యాంగిల్స్ డ్యాన్స్‌లు చేయడం ప్రారంభించాడు. చివరికి మందుబాటిల్ ఆశ చుపించడంతో కాస్తా శాంతించాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. కానీ, వాహానం ముందుకు వచ్చినకొద్దీ అతను పక్కకు జరుగుతుండడంతో.. చివరికి స్ట్రీట్ లైట్ క్రేన్‌ను రంగంలోకి దింపారు. చివరికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటల్ బాటిల్ చుపుతూ చాకచాక్యంగా కిందికి దించారు. కిందికి తీసుకొచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు… గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో… సికింద్రాబాద్‌ సంగీత్ సర్కిల్ వద్ద రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగింది.