ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్…!

ఆమ్ ఆద్మీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ఢిల్లీ అల్లర్లలో ఆమ్‌ఆద్మీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పాత్ర ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. అందుకు రుజువుగా తాహీర్ హుస్సేన్ ఫ్యాక్టరీలో రాళ్లు, పెట్రోల్ బాంబులతో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలతో నిండి వున్న సంచులు ప్రత్యక్ష కావడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో తాహీర్ కోసం ఢిల్లీ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. ఇక, ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను తాహీర్ ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవాలని, వాటికి ఎలాంటి ఆధారాలూ లేవని అంటున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని, ఒకవేళ నేరం రుజువైతే కఠిన శిక్ష విధించాలన్నారు.