మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా :ఢిల్లీ సీఎం

ఈశాన్య ఢిల్లీ అల్లర్ల బాధితులకు సీఎం కేజ్రీవాల్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం అందిస్తమని ప్రకటించారు. అల్లర్లలో నివాసాలు కోల్పోయినవారికి రూ.5లక్షలు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మైనర్లు చనిపోతే రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు పరిహారం అందిస్తామన్నారు. బీమా లేని దుకాణాల వారికి రూ.5లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు. అటు..అల్లర్లను రాజకీయం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్..అల్లర్లతో ఏ పార్టీ నేతలకు సంబంధమున్న..కఠిన శిక్షలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అల్లర్లను రెచ్చగొట్టే అవసరం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లేదన్నారు. ఒకవేళ ఎవరికైనా ప్రమేయం ఉంటే రెండింతల శిక్ష అమలు చేయాలన్నారు. దేశ ఐక్యతపై ఏ పార్టీ కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. కాగా..ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు.