60 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం…

లెక్కలో చూపని 60 కేజీల బంగారాన్ని కర్ణాటక కమర్షియల్ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ నెల 25న కర్ణాటకలోని బెంగళూరు చిక్‌పేట ప్రాంతంలో గల… రంగనాథ్‌ మాన్షన్‌, సకాలజీ మార్కెట్‌లోని హోల్‌సేల్‌ ఆభరణాల డీలర్లపై రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా లెక్కలో చూపని 60 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హ్యాండోవర్ చేసుకున్న ఆభరణాల విలువ రూ. 21 కోట్లు ఉంటుందని తెలిపిన అధికారులు… 1.3 కోట్ల రూపాయల జీఎస్టీని తప్పించుకునేందుకు వ్యాపారులు ప్రయత్నించారని పేర్కొన్నారు.