పీఏ బర్త్‌డే గిఫ్ట్‌గా మెర్సిడెస్‌ బెంజ్‌…

పీఏ బర్త్ డే రోజు బెంజ్‌ కార్‌ గిఫ్ట్‌ గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది బ్రిటన్‌ పాప్‌ గాయని మాడిసన్‌ బీర్‌. పీఏ 30వ పుట్టిన రోజు సందర్భంగా లంచ్‌ ఏర్పాటు చేసిన మాడిసన్‌.. అనంతరం ఆమెకు న్యూ మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. 12 ఏళ్ల పాత కారుతో తన పీఏ ఇబ్బంది పడటాన్ని స్వయంగా వీక్షించిన మాడిసన్‌ రూ 30 లక్షల విలవైన గిఫ్ట్‌ తో ఆమెను షాక్‌లో ముంచెత్తింది. 13 ఏళ్ల వయసులోనే మాడిసన్‌కు గాయనిగా గుర్తింపు లభించింది.