`భీష్మా` టీంను అభినందించిన పవన్ కళ్యాణ్…

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కి.. ప్రేక్షాకదరణ పొందుతున్న చిత్రం భీష్మా. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అయితే.. సోమవారం భీష్మ చిత్ర బృందం పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను కలిసింది. డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరో నితిన్‌, నిర్మాత నాగ వంశి… పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

నితిన్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను కలిసిన అనంతరం… తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నితిన్. `పవర్ స్టార్ భీష్మ చిత్ర యూనిట్‌ని అభినందించారు. ఈ సంతోషం వెలకట్టలేనిది` అని నితిన్ ట్వీట్ చేశాడు. వెంకీ కుడుముల కూడా తాను పవన్‌ను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. `నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చే మూమెంట్ ఇది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భీష్మ చిత్రం సక్సెస్ సాధించినందుకు అభినందనలు తెలిపారు. దిల్ రాజు గారి వల్ల పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది` అని వెంకీ కుడుముల ట్వీట్ చేశాడు. కాగా.. పవన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.