అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు

అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 38 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం రికార్డు అంటున్నారు. 1982లో అక్కడి సైనీ ద్వీపంలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా… ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన అక్కడికి సమీపంలో ఉన్న సెయ్మోర్ ద్వీపంలో 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు రికార్డు స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే అంటార్కిటికాతోపాటు చుట్టు పక్కల ఉన్న మంచు ప్రాంతంలోని మంచు అంతా కరిగితే అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి. దీంతో తీరప్రాంతాల్లో ఉండే అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.