రూ. 45లక్షలు మోసం.. పోలీసులకు యాంకర్ రవి ఫిర్యాదు!

సందీప్ అనే వ్యక్తిపై టీవీ యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సందీప్ అనే వ్యక్తి తన వద్ద రూ. 45 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పుగా తీసుకున్న మొత్తం రూ. 45 లక్షల్లో.. కొన్ని రోజుల తర్వాత కొంత తిరిగి ఇచ్చాడని, మిగతా డబ్బులు ఇవ్వాలని అడగ్గా బెదిరింపులకు పాల్పడుతున్నాడని రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఎక్కడికి వెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అయితే, తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్… వారిని కూడా ఇలాగే మోసం చేశాడని సోమవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.